నెట్టింటి నుంచి నట్టింట్లోకి..

9 Jul, 2018 09:17 IST|Sakshi

అందుబాటులోకి ‘దుకాన్‌లైన్‌’

ఆర్డరివ్వడమే ఆలస్యం.. ఇంటికే సరుకులు

సాక్షి,సిటీబ్యూరో: నగర జీవనం బిజీ అయిపోయింది. ఇంట్లో పిల్లలు స్కూళ్లకు,కాలేజీలకు వెళితే.. పెద్దవారు ఆఫీసుల దారి పడుతుంటారు. ఇంట్లోకి ఏం కావాలన్నా ఎవరో ఒకరిని బతిమాలి తెచ్చుకునే రోజులు పోయాయి. మనకు కావాల్సిన మందులు, దుస్తులు వంటివి ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ దారిలో కిరాణా సరుకులు కూడా చేరాయి. ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చే బంధు, మిత్రులు.. అందరికీ మర్యాదలు చేయాలంటే ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. మంచి విందు ఏర్పాటు చేయాలి. ఇలాంటప్పుడు రోజుల తరబడి షాపింగ్‌ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే..ఓ వస్తువు ఒక దగ్గర ఉంటే మరొకటి ఇంకోచోట దొరుకుతుంది. అన్నీ ఒక్కచోటేఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. ఇప్పుడు అలాంటి రోజు వచ్చేసింది.అదే ‘దుకాన్‌లైన్‌’.

ఆర్డర్‌ ఇచ్చేసి ఇంట్లో కూర్చొంటే చాలు..  
సాధారణంగా కిరాణ షాపునకు పోయేప్పుడు ఇంట్లో కావాల్సినవన్నీ ఓ చీటీ రాసుకుని బయలుదేరుతాం. వాటిలో చాలా వస్తువులు ఒకే షాపులో దొరకడం కష్టమే. పిల్లలకు కావాల్సిన వాటిని కిడ్స్‌ స్టోర్‌లో, మరికొన్ని మెడికల్‌ స్టోర్‌లో వెతకాలి. తాలింపు గింజలు, నూనెలు, బియ్యం, పప్పులు వంటివన్నీ కిరాణా స్టోర్‌లో దొరుకుతాయి. ఇక బ్యూటీ బ్రాండ్స్‌ కావాలంటే మరోచోటుకు పోవాల్సిందే. చిన్న మొత్తాల్లో కొనాలంటేనే రెండు మూడు షాపులు తిరగాలి. ఇక పెద్ద మొత్తంలో అయితే మరీ కష్టం. పైగా పెద్ద మొత్తంలో సరుకులు కొంటే తెచ్చుకోవడానికి ఏ ఆటోనో కిరాయికి పెట్టుకోవాలి. ఇలాంటి సమస్యలేవీ లేకుండా మనకు కావాల్సిన సరుకులను కావాల్సిన మొత్తంలో ఆర్డరిస్తే ఎంచక్కా ఇంటికే తీసుకొస్తుంది దుకాన్‌లైన్‌. మనకు కావాల్సినవి ‘ఆన్‌లైన్‌లో బుకింగ్‌’ చేసుకుంటే చాలు.. అన్ని కిరాణా సరుకులను ఇది ఇంటికి సరఫరా చేస్తుంది. వంటకు ఉపయోగించే సరుకులే కాదు.. సబ్బులు, క్రీములు కూడా అందిస్తుంది. 

స్మార్ట్‌ఫోన్‌లో దుకాణం..
మీ వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు కావాల్సిన సరుకులు నెట్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. ‘దుకాన్‌లైన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎంచక్కా కావాల్సిన వాటిని ఆర్డర్‌ చేయొచ్చు. ఏ రోజు ఏయే వస్తువులపై ఎంత డిస్కౌంట్‌ ఉందో కూడా ఈ యాప్‌ సాయంతో చూసుకోవచ్చు. అంతేకాదు.. ఎంత మొత్తంలో కొంటే ఎంత తగ్గింపు వర్తిస్తుందో కూడా చూపిస్తుంది. ఈ డిస్కౌంట్‌ అవకాశాన్ని కేవలం గృహ వినియోగదారులే కాదు చిన్న స్థాయి కిరాణా వ్యాపారులూ ఉపయోగించుకోవచ్చు. రోజువారీగా షాపులో అయిపోయిన కిరాణా సరుకులు కోసం డీలర్ల దగ్గరకు పరుగుతీయకుండా నేరు ఈ దుకాన్‌లైన్‌ నుంచి కొనుక్కోవచ్చు.  

సరుకులు చేరాకే పేమెంట్‌..
మనకు కావాల్సిన కిరాణా సరుకులను సాయంత్రం 6 గంటల్లోగా ఆర్డర్‌ చేస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల్లోపు ఇంటికి చేరుస్తుంది దుకాన్‌లైన్‌. సరుకులు వచ్చాక అన్నీ సరిచూసుకుని తర్వాత డబ్బులు కట్టవచ్చు. కనీసం రూ.2 వేలకు పైగా మొత్తానికి డెలివరీ కూడా ఉచితమే. అంతేకాదు.. ప్రతి రోజూ మార్కెట్లో ధరలు తగ్గే సరుకుల వివరాలను దుకాన్‌లైన్‌ మెసేజ్‌ చేస్తుంది. 

మరిన్ని వార్తలు