డ్యూక్స్‌ ‘బటర్‌ ఫ్లేవర్డ్‌’ వాఫీ

30 Apr, 2019 07:57 IST|Sakshi

హైదరాబాద్‌: రవి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తాజాగా ‘బటర్‌ ఫ్లేవర్డ్‌’ వాఫీ ని  మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ క్రీమీ, క్రంచ్‌ వాఫీ వినియోగదారులకు కొత్త ఫ్లేవర్‌తో మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిందర్‌ అగర్వాల్‌ ఆలోచనలకు అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఫ్లేవర్‌లను ఆవిష్కరించడానికి రవి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డ్యూక్స్‌ ముందుంటుందని పేర్కొంది. చాకొలెట్స్, వాఫీలు, కుకీస్, బిస్కెట్లసహా పలు ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని వివరించింది. ‘‘క్రీమీ వాఫర్‌ విభాగం మార్కెట్‌లో రవి ఫుడ్స్‌ వాటా దాదాపు రూ.45,000 కోట్లు. ఏడాదికి 10 శాతం నుంచి 12 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోందని ఎండీ అగర్వాల్‌ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు