సామ్‌సంగ్ నుంచి 12 జీబీ డైనమిక్ ర్యామ్

10 Sep, 2015 00:02 IST|Sakshi
సామ్‌సంగ్ నుంచి 12 జీబీ డైనమిక్ ర్యామ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఉపకరణాల రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రపంచంలో తొలిసారిగా 12 జీబీ సామర్థ్యంతో మొబైల్  డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని (డీఆర్‌ఏఎమ్) రూపొందించింది. ఉపకరణాల్లో అత్యంత కీలకమైన ర్యామ్‌లలో డీఆర్‌ఏఎమ్ ఒక రకం. 20 నానోమీటర్ ప్రాసెస్ సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తయారు చేసినట్టు సామ్‌సంగ్ వెల్లడించింది. ఇది అధిక సామర్థ్యం, స్పీడ్‌తోపాటు ఎనర్జీ 20 శాతం తక్కువగా వినియోగిస్తుంది. ఈ ఫీచర్లన్నీ తదుపరి తరం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల వంటి మొబైల్ ఉపకరణాల అభివృద్ధికి కీలకమని కంపెనీ తెలిపింది. వినియోగదారులు అద్భుత అనుభూతికి లోనవుతారని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మెమరీ సేల్స్ ఈవీపీ జూ సున్ చోయి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త మెమరీ చిప్ రాకతో భవిష్యత్తులో అల్ట్రా స్లిమ్ పీసీలు, డిజిటల్, ఆటోమోటివ్ ఉపకరణాలకు అప్లికేషన్లు విస్తృతం అవుతాయని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు