లాక్‌డౌన్‌ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట

2 May, 2020 16:19 IST|Sakshi

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో గ్రీన్ సిగ్నల్

రెడ్ జోన్ : రెడ్ సిగ్నల్

అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్  తదితర కంపెనీలకు ఊరట

స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల విక్రయాలకు గ్రీన్ సిగ్నల్

సాక్షి, ముంబై :  కరోనా వైరస్  వ్యాప్తి,  లాక్‌డౌన్‌ ఆంక్షలతో  తీవ్రంగా నష్టపోయిన  ఈ కామర్స్ దిగ్గజాలకు తాజాగా భారీ  ఊరట లభించనుంది. మే 4వ తేదీ నుంచి అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్  లాంటి  కంపెనీల  ఆన్ లైన్ వ్యాపారానికి  కొన్ని ఆంక్షలతో అనుమతి  లభించింది. నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది.  రెడ్ జోన్లు మినహా తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ అనుమతి నిత్యావసర వస్తువులను మాత్రమే పరిమితమైంది. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా  తాజాగా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.  సంబంధిత నిబంధనలను పాటిస్తూ  గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నివసించే వినియోగదారులకు మే 4 నుంచి నాన్ ఎసెన్షియల్ వస్తువులను డెలివరీ చేయవచ్చు.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ సహా ఇతర గాడ్జెట్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.  అయితే రెడ్ జోన్లలో మాత్రం కిరాణా సరుకులు, మందులు లాంటి నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి వుంది. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ)

చదవండి: అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు
హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట

మరిన్ని వార్తలు