క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు తగ్గాయ్

17 Nov, 2016 01:02 IST|Sakshi
క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు తగ్గాయ్

30 శాతం వరకు క్షీణత  కరెన్సీ నోట్ల రద్దే కారణం

 న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకు వచ్చే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆర్డర్లు తగ్గారుు. దాదాపు 30 శాతం వరకు క్షీణించారుు. సీవోడీలు తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వపు నిర్ణయాన్ని ఆయా ఈ-కామర్స్ ఆహ్వానించడం విశేషం. నోట్ల రద్దు చర్య దీర్ఘకాలంలో పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారుు. ‘కరెన్సీ నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పుడు అమ్మకాలు తగ్గారుు. కానీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. అర్డర్లు క్రమంగా పెరగుతున్నారుు’ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ తెలిపారు. సీవోడీ ఆర్డర్లు దాదాపు 30 శాతానికి తగ్గాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థపకుడు కూనల్ భల్ పేర్కొన్నారు. తమ సీవోడీ ఆర్డర్లు 15 శాతంమేర క్షీణించాయని షాప్‌క్లూస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్ సేథి తెలిపారు.

30 శాతానికి ఆర్డర్లు: మొత్తం విక్రయాల్లో సీవోడీ ఆర్డర్లు 30%కి తగ్గాయని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కూనల్ భల్ పేర్కొన్నారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు ఒకానొక సందర్భంలో సంస్థ మొత్తం అమ్మకాల్లో 70%కి చేరారుు. ఇవి తర్వాత 50%కి పడ్డారుు. కానీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఆర్డర్లు ఒక్కసారిగా దాదాపు 30%కి క్షీణించారుు. ఇప్పుడు అరుుతే స్వల్పంగా పెరిగారుు. ఆర్డర్లు త్వరలోనే యథాస్థారుుకి చేరుతాయని భావిస్తున్నాం’ అని వివరించారు.

సేవలు యథాతథం: కరెన్సీ నోట్ల రద్దు ప్రకటన అనంతరం అమెజాన్, పేటీఎం వంటి సంస్థలు వాటి సీవోడీ ఆర్డర్లను సగానికి కుదించుకున్నారుు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు ఆర్డర్ల విలువపై పరిమితులను విధించారుు. అరుుతే ఇప్పుడు అమెజాన్ వాటి సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ అరుుతే బుధవారం నుంచి తన సేవలను పూర్తిగా పునరుద్ధరించింది.

ధీమాగా వాలెట్ సంస్థలు: పేటీఎం, ఫ్రీచార్జ్, మోబిక్విక్ వంటి మొబైల్ వాలెట్ సంస్థలు రానున్న రోజుల్లో వారి యూజర్ల సంఖ్యతోపాటు లావాదేవీలు కూడా బాగా పెరుగుతాయని ధీమాగా ఉన్నారుు. ఫ్రీచార్జ్ లావాదేవీ లు గణనీయంగా ఎగశాయని కూనల్   తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ పెరుగుదల వల్ల ఈ-కామర్స్ సం స్థలకు దీర్ఘకాలంలో లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది వారి చెల్లింపుల కోసం డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఎంచుకుంటున్నారని బన్సాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు