ఆర్థిక అనిశ్చితి నీడన రూపాయి!

11 Dec, 2018 01:14 IST|Sakshi

50 పైసలు నష్టంతో 71.32 వద్ద ముగింపు  

ముంబై: రికవరీ అవుతోందనుకున్న రూపాయి... మళ్లీ పతన బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ డాలర్‌ మారకంలో 50 పైసలు పడి 71.32 వద్ద ముగిసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి అంశాల ప్రభావం రూపాయిపై పడుతోంది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఈ నెల ప్రారంభంలో దాదాపు 69.50 వరకూ రికవరీ అయ్యింది. క్రూడ్‌ ధరలు తగ్గడం, దేశంలోకి తాజాగా వచ్చిన విదేశీ నిధులు దీనికి కారణం. అయితే ఈ స్థాయిలో రూపాయి నిలబడలేక బలహీన ధోరణిలోకి జారింది. ఇందుకు ప్రధాన కారణాలను చూస్తే...అధ్యక్షుల సమావేశంతో ముగిసిపోయిందను కున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భయాలు తిరిగి (చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌  మెంగ్‌ వాంజూ కెనడాలో అరెస్ట్‌తో) ప్రారంభం కావడం. తగ్గాయనుకున్న క్రూడ్‌ ధరలు (ఒపెక్, రష్యా చమురు కోతల నిర్ణయంతో) తిరిగి పెరుగుతాయన్న ఆందోళనలు దీనితో కరెంట్‌ అకౌంట్‌ లోటుపై హెచ్చరికలు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీని ఇస్తుందన్న అంచనాలు.

నేడు మరింత డౌన్‌?
పలు బలహీన అంశాల నేపథ్యంలో రూపాయి సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 71.28 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.44కు పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనమూ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ వార్తరాసే సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ బలహీనంగా 72.50 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషనలూ ఉన్నాయి.  ఆర్‌బీఐ గవర్నర్‌ బాధ్యతలకు ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ఇందుకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉండగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు బిజేపీకి వ్యతిరేకంగా ఉంటే, పతనం మరింత వేగంగా ఉండవచ్చు.  రూపాయి మళ్లీ 75వైపు పయనించే అవకాశం ఉందని కొన్ని సంస్థలు విశ్లేషణలు చేస్తున్న విషయం గమనార్హం.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!