ఆరంభ లాభాలు ఆవిరి

12 Sep, 2015 00:50 IST|Sakshi
ఆరంభ లాభాలు ఆవిరి

- 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,610కు సెన్సెక్స్
ముంబై:
పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెలువడనున్న (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి)నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో స్టాక్‌మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. ఫెడ్ భయాలు కూడా ప్రభావం చూపాయి. ఒక దశలో 250 పాయింట్లకు పైగా లాభపడిన సెనెక్స్ చివరకు 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,610 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1 పాయింటు లాభపడి 7,789 పాయింట్ల వద్ద ముగిసింది.

యాపిటల్ గూడ్స్, లోహ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు తమ ప్రారంభ లాభాలను కోల్పోయాయి. కాగా టెక్నాలజీ, కొన్ని ఫార్మా షేర్లు మాత్రం లాభపడ్డాయి. కాగా నాలుగు వారాల నష్టాలకు ఈ వారంలో బ్రేక్ పడింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 408 పాయింట్లు(1.62 శాతం), నిఫ్టీ 134 పాయింట్లు(1.75 శాతం) లాభపడ్డాయి. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్‌బీఐ పాలసీకు మార్గం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు.30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

మరిన్ని వార్తలు