ఇప్పుడు ఐటీ అధికారుల టార్గెట్‌ వారే..

28 Aug, 2017 16:10 IST|Sakshi
ఇప్పుడు ఐటీ అధికారుల టార్గెట్‌ వారే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను కట్టకుండా.. భారీగా ఆదాయాలు ఆర్జిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్న ఐటీ అధికారుల కన్ను ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ దారులపై పడింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి ఎక్కువ వడ్డీ ఆదాయాలు ఆర్జిస్తున్న వేల మంది అధికారులపై ఐటీ అధికారులు దృష్టిసారించినట్టు తెలిసింది. ఐటీ అధికారులు కన్నేసిన వారిలో రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ ఆదాయం ఆర్జిస్తున్న పలువురు సీనియర్‌ సిటిజన్లున్నారు. వీరు తమ ఆదాయాన్ని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో చూపించడం లేదని తెలిసింది. అంతేకాక ఈ మొత్తానికి పన్ను కూడా చెల్లించడం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధికారులు చెప్పారు.
 
ప్రస్తుతం తమ దృష్టంతా ఎక్కువ మొత్తంలో పన్ను ఎగవేతదారులపైనేనని, తక్కువ రిటర్నులు ఆర్జిస్తున్న చిన్నా చితకా వ్యక్తులను తాము ఛేజ్‌ చేయడం లేదని టాప్‌ ర్యాంకింగ్‌ పన్ను అధికారి చెప్పారు. అంతేకాక నగదు రూపంలో చెల్లింపులు అందుకునే ప్రొఫిషనల్స్‌ను కూడా ఆదాయపు పన్ను అధికారులు టార్గెట్‌ చేశారు. వీరు కూడా తమ అసలు ఆదాయాన్ని వార్షిక స్టేట్‌మెంట్లలో చూపించడం లేదని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.
మరిన్ని వార్తలు