ఐదు వారాల కనిష్టానికి సెన్సెక్స్‌

23 Jan, 2020 06:13 IST|Sakshi

బడ్జెట్‌ వచ్చే వారమే ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. కంపెనీల క్యూ3 ఫలితాలు  అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. చైనాలో ఇటీవల ఆరుగురి మృతికి కారణమైన  కరోనా వైరస్‌ కేసు ఒకటి అమెరికాలో వెలుగులోకి రావడం ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 208 పాయింట్లు పతనమై 41,115 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 12,107 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఐదు వారాల కనిష్ట స్థాయి.

ఐటీఐ ఎఫ్‌పీఓ ప్రైస్‌బ్యాండ్‌ రూ.72–77
ప్రభుత్వ రంగ ఐటీఐ కంపెనీ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) ఇష్యూకు ప్రైస్‌బాండ్‌ను రూ.72–77గా నిర్ణయించింది. గురువారం షేర్‌ ముగింపు ధర, రూ.100తో పోల్చితే ఇది 25% మేర తక్కువ. శుక్రవారం మొదలయ్యే ఈ ఎఫ్‌పీఓ ఈ నెల 28న ముగుస్తుంది.

బడ్జెట్‌ రోజు ట్రేడింగ్‌!
ఫిబ్రవరి 1(శనివారం)న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.  అయితే బడ్జెట్‌ రోజు కావడంతో శనివారం కూడా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడింగ్‌ జరగనున్నది.

మరిన్ని వార్తలు