వృద్ధి క్రమంగా మెరుగుపడుతుంది

9 May, 2018 00:32 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి నివేదిక

ఐక్యరాజ్యసమితి: జీఎస్టీ, కార్పొరేట్, బ్యాంకు బ్యాలన్స్‌ షీట్ల సమస్యలు భారత ఆర్థిక వృద్ధి 2017లో పడిపోవడానికి కారణాలని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. వృద్ధి రేటు క్రమంగా కోలుకుని 2018లో 7.2 శాతానికి చేరుతుందని, 2019లో 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.

‘‘భారత్‌లో క్రమంగా పురోగతి ఉంటుందని భావిస్తున్నాం. కార్పొరేట్‌ రంగం జీఎస్టీకి సర్దుకుపోవడంతో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయి. ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెరగడంతోపాటు కార్పొరేట్, బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లు మెరుగుపరుచుకునే విషయంలో ప్రభుత్వ మద్దతు ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని నివేదిక పేర్కొంది.

పన్ను సంస్కరణ, పన్నుల వసూలు బలోపేతం అయితే భారత్, చైనా, ఇండోనేషియా తరహా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ 3– 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.   

మరిన్ని వార్తలు