స్టాక్‌మార్కెట్‌పై ఆర్థిక సర్వే ఏం చెప్పింది?

29 Jan, 2018 18:32 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రికార్డులతో  దూసుకెళుతున్న దేశీయ ఈక్విటీమార్కెట్లపై  ప్రధాన ఆర్థిక సలహాదారు  అరవింద్‌ సుబ్రమణియన్‌ కీలక హెచ్చరిక చేశారు. మార్కెట్‌లో బబుల్‌  లాంటి వాతావరణం నెలకొందని చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   అక్రమ ఆస్తులను నిరోధించే భాగంలో  ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లకు తరలినట్టు  తెలిపారు. ముఖ్యంగా  నోట్ల రద్దు తర్వాత   విధించిన పన్ను దీనికి దారి తీసిందన్నారు. నగదు నిల్వలు, ఆస్తులు, బంగారం నిల్వలపై విధించిన పన్ను  కారణంగా స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులకు మళ్లినట్టు తెలిపారు. అయితే ఈ బబుల్‌ ఎపుడైనా పేలే  అవకాశం ఉందంటూ   ఇన్వెస్టర్లకు  కీలక సూచనలు అందించారు.

ఎకనామిక్ సర్వే రిపోర్టును సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  మార్కెట్లు బాగా పెరిగినపుడు  తప్పని సరిగా  వెనక్కి రావాలని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణిని   చూశామని  పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రతమత్తంగా వుంటూ  మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.  మార్కెట్లో స్టాక్ ధరల పరంగా  వేగంగా వృద్ధి చెందుతున్నట్లు మార్కెట్ అంచనా వేస్తోంది. ఏదేమైనా, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రమాదాల  నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ  ఆర్థిక సర్వే నివేదిక ఈ భయాలను పునరుద్ఘాటించింది. ఆదాయ వృద్ధి అంచనాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వే నివేదించింది. భారతదేశంలో స్టాక్ మార్కెట్ పెరుగుదలలో ఉంది. కానీ  ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కార్పొరేట్ లాభం / జీడీపీ నిష్పత్తి   క్షీణిస్తోందని పేర్కొంది.  ఇది భారత్‌లో 3.5క్షీణిస్తే.. అమెరికా  9శాతం జీడీపీతో  పటిష్టంగా ఉందని పేర్కొంది.  స్టాక్ మార్కెట్ బూమ్ కాలంలో, అమెరికా రియల్ రేట్లు సగటున -1.0 శాతం ఉండగా, భారతదేశంలో ఇది 2.2 శాతంగా ఉందని సర్వే తెలిపింది.

>
మరిన్ని వార్తలు