చందా కొచర్‌ ఖరీదైన ఫ్లాట్‌ గోవిందా!

10 Jan, 2020 16:37 IST|Sakshi
చందా కొచర్‌(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వీడియోకాన్‌ రుణాల జారీ విషయంలో క్విడ్‌ ప్రో​కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌పై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్య తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) చందాకొచర్‌కు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఎటాచ్‌ చేసింది. ఇందులో ముంబైలోని ఖరీదైన ఆమె ఫ్లాట్‌తోపాటు, ఆమె భర్త దీపక్‌ కొచర్‌ కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.

ఐసీఐసీఐ- వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌ తనపదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.  వీడియోకాన్‌ గ్రూపునకు సుమారు 3,250 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు  ప్రధాన ఆరోపణ.  ఈ వ్యవహారంలో  ఇప్పటికే  పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే  తనను పదవినుంచి తొలగించడంపై చందా కొచర్‌ న్యాయ పోరాటం చేస్తున్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాహన విక్రయాలు లాక్‌‘డౌన్‌’

మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు

విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ 1,125 కోట్లు

దేశీ బ్యాంకింగ్‌ రంగానికి నవోదయం

ఎగుమతిదారులకు ఆర్‌బీఐ ఊరట

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా