కోట్ల విలువ చేసే లాలూ ల్యాండ్‌ అటాచ్‌

8 Dec, 2017 15:37 IST|Sakshi

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాకిచ్చింది. ఐఆర్‌సీటీసీ హోటల్‌ స్కామ్‌ కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు మనీ లాండరింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో పట్నాలో రూ.45 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఈ భూమి లాలూ కుటుంబ సభ్యుల పేరుతో ఉందని, అక్కడ మాల్‌ను నిర్మించడానికి ప్రతిపాదనలు ఉన్నట్టు ఏజెన్సీ వర్గాలు చెప్పాయి. ఈ ప్లాట్‌ మార్కెట్‌ విలువ రూ.45 కోట్లుగా అంచనావేస్తున్నట్టు పేర్కొన్నాయి.

మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఈ ప్రాపర్టీని అటాచ్‌ చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గత వారంలోనే లాలూ భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీని విచారణ చేశారు. అంతకముందు రెండుసార్లు ఆయన కొడుకు తేజస్వి యాదవ్‌ను కూడా ప్రశ్నించారు. జూలైలో లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు, మిగిలిన వారిపై ఏజెన్సీ కేసు రిజిస్ట్రర్‌ చేసింది.  మనీలాండరింగ్‌ నివారణ చట్టం కింద లాలూ కుటుంబ సభ్యులపై ఈడీ క్రిమినల్‌ కేసు రిజిస్ట్రర్‌ చేసింది. 

>
మరిన్ని వార్తలు