మెహుల్‌ చోక్సీకి ఎదురు దెబ్బ

11 Jul, 2019 18:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, గీతాంజలి అధినేత మెహుల్‌చోక్సీకి మరో షాక్‌ తగిలింది. దుబాయ్‌లో చోక్సీకి చెందిన విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకుంది. దుబాయ్‌లోని మూడు వాణిజ్య ఆస్తులను, అతి విలాసవంతమైన మెర్సిడెస్‌ బెంజ్‌ ఈ280, కారును, 24.8 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లను ఎటాచ్‌ చేసింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌  మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. 

కాగా 14వేల కోట్ల  రూపాయల  పీఎన్‌బీ స్కాంలో మెహుల్‌ చోక్సీ కిలక నిందితుడుగా ఉన్నాడు. చోక్సీపై కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేస్తున్నాయి. చోక్సీ పాస్‌పోర్టు రద్దు చేయడంతోపాటు, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో మరో కీలక నిందితుడు చోక్సీ మామ, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ లండన్‌ జైల్లో  ఉన్న సంగతి  తెలిసిందే. 

మరిన్ని వార్తలు