మాల్యాకు రెడ్ కార్నర్ నోటీస్

12 May, 2016 13:09 IST|Sakshi
మాల్యాకు రెడ్ కార్నర్ నోటీస్

న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త  విజయ్ మాల్యాకు కొత్త చిక్కు ఎదురు కాబోతుంది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి, మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై మే20 తేదీ వరకు స్పందించాలని ఆదేశించింది.

మరోవైపు విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

‘1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని మేము ఆదేశించలేము’ అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. గత నెలే అతనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి భారత్ కు రప్పించాలని, విచారణకు తోడ్పడాలని ఇంటర్ పోల్ ను ఈడీ కోరనుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీరవ్‌ ఎఫెక్ట్‌ : చోక్సీ కొత్త రాగం

ప్రాఫిట్‌ బుకింగ్‌ : నష్టాల్లోకి మార్కెట్లు 

శాంసంగ్‌ దూకుడు : తొలి 5జీ ఫోన్‌ వెరీ సూన్‌

ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు

‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’

షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఫేస్‌బుక్‌

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

జపాన్‌ టు ఇండియా!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

24 గంటల్లో థాయ్‌ల్యాండ్‌ వీసా..!

ఎన్నికలు : సోషల్‌ మీడియా ప్రకటనలపై కొరడా

హువావే హానర్ 10ఐ స్మార్ట్‌ఫోన్

న్యూజిలాండ్‌ సంచలన నిర్ణయం

గూగుల్‌కు భారీ జరిమానా

మార్కెట్లకు సెలవు : హోలీ శుభాకాంక్షలు

ట్యాంపర్‌ ప్రూఫ్‌  ప్యాకింగ్‌తో ‘జొమాటో’ ఫుడ్‌

120 కోట్లు దాటిన  టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్‌మెంట్‌

ఎంబసీ రీట్‌... 2.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

మార్కెట్లో ఫెడ్‌ ప్రమత్తత

వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

నీరవ్‌ 173 పెయింటింగ్స్,  11 వాహనాలు వేలం!

ఐటీలో 8.73 లక్షల  ఉద్యోగాలు వచ్చాయ్‌!

1.46 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ 

డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో!!

దేశీ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ‘స్విచ్‌ ఆఫ్‌’

అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు

జెట్‌కు బ్యాంకుల బాసట

బిల్‌గేట్స్‌ సంపద@ 100 బిలియన్‌ డాలర్లు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..