మార్కెట్‌లో టీచర్స్‌ డే ఎఫెక్ట్‌..!

5 Sep, 2017 10:48 IST|Sakshi

సాక్షి,  ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లలో  టీచర్స్‌ డే ఉత్సాహం నెలకొంది. సెప‍్టెంబర్‌ 5  ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా  ఎడ్యుకేషన్‌  రంగ షేర్లు లైమ్‌ లైట్‌లోకి వచ్చాయి.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా లాభాలను  నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా  ఆర్వీ డెనిం అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ షేర్లు 5 శాతం  కరీర్‌ పాయింట్‌ 4 శాతం, ఎంటీఎడ్యుకేర్‌ 3.69 శాతం, లాభాలతో కొనసాగుతున్నాయి.

మరోవైపు  యూరోప్‌, ఆసియన్‌ మార్కె‍ట్లు నష్టపోతున్నప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్లు  సోమవారం నాటి భారీ నష్టాలనుంచి  ఇవాళ రీ బౌండ్‌ అయ్యాయి.   బ్యాంకింగ్‌,  మీడియా రంగ షేర్ల లాభాల మద్దుతుతో  సెన్సెక్స్‌ ఒక దశలో  100 పాయింట్లకు పైగా లాభపడింది.  అటు నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకంగా భావించే 9900కి పైన స్థిరంగా కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు