డుకాటి కొనుగోలుకు ఐషర్‌ భారీ బిడ్‌

7 Sep, 2017 19:03 IST|Sakshi
డుకాటి కొనుగోలుకు ఐషర్‌ భారీ బిడ్‌
సాక్షి, ముంబై: ఇటాలియన్‌ సూపర్‌ బైకు తయారీదారి డుకాటిని సొంతం చేసుకోవడానికి దేశీయ కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  దేశీయ దిగ్గజ క్లాసిక్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పటికే డుకాటిని కొనుగోలుచేయనున్నట్టు వార్తలు రాగ.. తాజాగా దీనికోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పేరెంట్‌ కంపెనీ ఐషర్‌ మోటార్స్‌ బైండింగ్‌ ఆఫర్‌ను కూడా రూపొందించిందని తెలుస్తోంది. డుకాటి కోసం 1.8 బిలియన్‌ డాలర్ల(రూ.11,524కోట్లకు పైన) నుంచి 2 బిలియన్‌ డాలర్ల(రూ.12,806 కోట్లు)కు బిడ్‌ వేసినట్టు ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. ఒకవేళ ఈ ఆఫర్‌ విజయవంతమైతే, ఐషర్‌ మోటార్స్‌ పోర్టుఫోలియోకు బూస్ట్‌ వస్తుందని తెలుస్తోంది. అంతేకాక ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండు ఐషర్‌ మోటార్స్‌ చేతికి వస్తుంది. డుకాటి వేలంలో పాల్గొంటున్న ఏకైక ఆసియన్‌ కంపెనీ ఐషరేనని రిపోర్టు తెలిపింది. 
 
బ్యాంకులు, కన్సల్టెంట్స్‌తో ఫైనాన్సింగ్‌, నిర్మాణ నిబంధనలను ఐషర్‌ మోటార్స్‌ ఖరారు చేస్తుంది. డుకాటి సంస్థ జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో భాగంగా ఉంది. డుకాటిని కొనుగోలు చేయాలంటే ఫోక్స్‌వ్యాగన్‌తో సంప్రదించవలసి ఉంటుంది. 1.5 బిలియన్‌ యూరోలకు దీన్ని విక్రయించాలని ఫోక్స్‌వాగన్‌ చూస్తోంది. ఈబీఐటీడీఏకు ముందున్న ఆదాయాలకు ఇది 14-15 సార్లు అధికం. డుకాటిని విక్రయించగా వచ్చిన ఫండ్లు 2015 ఉద్గారాల స్కాండల్‌ నుంచి వచ్చిన నష్టాలను పూరించగలవని కంపెనీ భావిస్తోంది. రిపోర్టుల ప్రకారం పలు ఆటో తయారీ కంపెనీలు హార్లీ డేవిడ్‌సన్‌, సుజుకీ, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్పొలు డుకాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. 
>
మరిన్ని వార్తలు