నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు

1 Aug, 2019 12:37 IST|Sakshi

జూన్‌ మౌలిక రంగం వృద్ధి కేవలం 0.2%

ఆయిల్, సిమెంట్‌ ఉత్పత్తి పేలవ పనితీరు

న్యూఢిల్లీ: మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్‌ పనితీరు జూన్‌లో పేలవంగా ఉంది. వృద్ధి రేటు (2018 జూన్‌ ఉత్పత్తితో పోల్చి) కేవలం 0.2 శాతంగా నమోదయ్యింది. చమురు, సిమెంట్‌ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారడం దీనికి ప్రధాన కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్‌ 40.27 శాతం.  మే గణాంకాలను సైతం దిగువముఖంగా సవరించడం గమనార్హం. మే నెల వృద్ధి శాతాన్ని 5.1 శాతం నుంచి 4.3 శాతానికి కుదించడం జరిగింది. బుధవారం వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం జూన్‌లో ఎనిమిది రంగాల పనితీరునూ

చూస్తే... క్షీణతలో 4...
క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా 6.8 శాతం క్షీణత (మైనస్‌) నమోదయ్యింది.  
రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి రేటు –9.3 శాతం క్షీణించింది.  
సిమెంట్‌ రంగం కూడా 1.5 శాతం క్షీణతను             నమోదుచేసుకుంది.  
సహజ వాయువుల విభాగంలో కూడా –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 

వృద్ధిలో 4
స్టీల్‌ పరిశ్రమ 6.9 శాతం వృద్ధిని సాధించింది.
విద్యుత్‌ ఉత్పత్తిలో వృద్ధి రేటు 7.3 శాతం.  
ఎరువుల రంగంలో కేవలం 1.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే.  
బొగ్గు ఉత్పత్తిలో 3.2 శాతం వృద్ధి నమోదయ్యింది. 

మరిన్ని వార్తలు