వారంటీ పొడిగిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు

3 Apr, 2020 05:16 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులకు వారంటీని పొడిస్తున్నాయి. వీటిలో శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు ఉన్నాయి. మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య ముగిసే అన్ని రకాల ఉత్పత్తులకు మే 31 వరకు వారంటీ పొడిగిస్తున్నట్టు శామ్‌సంగ్‌ ప్రకటించింది. మార్చి 1 నుంచి మే 30 వరకు ముగిసే వాటికి మే 31 వరకు వారంటీ ఇస్తున్నట్టు వన్‌ ప్లస్‌ తెలిపింది. ఒప్పో సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అలాగే ఆన్‌లైన్‌ రిపేర్‌ సర్వీస్‌ను సైతం అందిస్తోంది. పరిస్థితి సర్దుమణగగానే కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా సర్వీసు అందిస్తామని షావొమీ స్పష్టం చేసింది. రియల్‌మీ మే 31 వరకు వారంటీ ఎక్స్‌టెండ్‌ చేసింది. మార్చి 15–ఏప్రిల్‌ 30 మధ్య కొనుగోలు చేసిన డివైస్‌లకు రిప్లేస్‌మెంట్‌ పీరియడ్‌ను అదనంగా 30 రోజులు పొడిగించింది. మార్చి 20 నుంచి మే 20 మధ్య వారంటీ ముగిసే ఉత్పత్తులకు 60 రోజులు పొడిగించినట్టు డీటెల్‌ వెల్లడించింది. మార్చి 15–మే 15 పీరియడ్‌లో వారంటీ పూర్తి అయ్యే ప్రొడక్టులకు 60 రోజులు ఎక్స్‌టెండ్‌ చేసినట్టు లావా పేర్కొంది. వారంటీ పీరియడ్‌ను రెండు నెలలు పొడిగించామని టెక్నో, ఇన్‌ఫినిక్స్‌ ప్రకటించాయి.

మరిన్ని వార్తలు