బయోకాన్ నికర లాభం 17 శాతం జంప్

22 Jul, 2016 01:27 IST|Sakshi
బయోకాన్ నికర లాభం 17 శాతం జంప్

న్యూఢిల్లీ: బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.147 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.126 కోట్లు)తో పోల్చితే 17 శాతం వృద్ధి సాధించామని బయోకాన్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.857 కోట్ల నుంచి రూ.952 కోట్లకు పెరిగిందని తెలిపింది. బయోలాజిక్స్, బ్రాండెడ్ ఫార్ములేషన్స్ తదితర అన్ని విభాగాల్లో మంచి వృద్ధి సాధించిన కారణంగా పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించామని బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ, కిరణ్ మజుందార్ షా చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేర్ 1.2 శాతం నష్టపోయి రూ.702 వద్ద ముగిసింది.

 బయోకాన్, మైలాన్ దరఖాస్తు స్వీకరించిన ఈఎంఏ
పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ప్రొడక్ట్‌కు చెందిన మైలాన్ మార్కెటింగ్ అథరైజేషన్ అప్లికేషన్ (దరఖాస్తు) సమీక్షకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఆమోదం తెలిపిందని బయోటెక్ దిగ్గజ కంపెనీ ‘బయోకాన్’ పేర్కొంది. ఈ అప్లికేషన్‌లో ప్రొడక్ట్‌కు సంబంధించిన క్లినికల్, ప్రి-క్లినికల్, అనలిటికల్, ఫంక్షనల్ వంటి తదితర అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ప్రొడక్ట్‌ను క్యాన్సర్ రోగుల కెమియోథెరపీ చికిత్సలోని న్యూట్రోపినియా కాలాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రొడక్ట్‌ను బయోకాన్, మైలాన్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

మరిన్ని వార్తలు