అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

16 Mar, 2020 10:31 IST|Sakshi

ముంబై : యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్‌ బ్యాంక్‌ కేసులో తమ ముందు హాజరు కావాలని అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు. 

కాగా అనిల్‌ అంబానీ గ్రూప్‌, ఎస్సెల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, వొడాఫోన్‌ తదితర కంపెనీలకు యస్‌ బ్యాంక్‌ ఇంచిన రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 6న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు ప్రైవేట్‌ బ్యాంకులు, సంస్థలు ముందుకురావడంతో పునరుద్ధరణ ప్రణాళిక ఊపందుకుంది. యస్‌ బ్యాంక్‌ షేర్‌ సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలో ఏకంగా 33 శాతం మేర పెరిగింది.

చదవండి : అంబానీ వద్ద చిల్లి గవ్వ లేదా?!

>
మరిన్ని వార్తలు