లాభాల్లో మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌

7 May, 2019 13:04 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు   లాభాలతో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వాణిజ్య వివాద పరిష్కార చర్చల కోసం ప్రతినిధుల బృందాన్ని వాషింగ్టన్‌కు పంపనున్నట్లు చైనా తాజాగా స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది.  దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాలేపు తగ్గించుకున్నా 106 పాయింట్లు ఎగసి 38,701ను తాకింది. నిఫ్టీ సైతం 43 పాయింట్లు పుంజుకుని 11,641 వద్ద , నిఫ్టీ 17 పాయింట్లులాబంతో 11615ట్రేడవుతోంది. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం కూడా కలసి వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

చైనీస్‌ దిగుమతులపై అదనపు టారిఫ్‌ల విధింపు అంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ చైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవర్‌ అయ్యాయి. ఆసియాలోనూ చైనా తదితర మార్కెట్లు బలపడ్డాయి. దాదాపు అన్నిరంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ దాదాపు ఒక శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, బ్రిటానియా, ఎయిర్‌టెల్‌, యస్‌బ్యాంక్‌, వేదాంతా, టైటన్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బీపీసీఎల్‌ 3 శాతం, ఐవోసీ 2 శాతం చొప్పున క్షీణించగా.. ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌, ఇండస్‌ఇండ్‌, యూపీఎల్‌ 1 శాతం మధ్య బలహీనపడ్డాయి.

మరిన్ని వార్తలు