లాభాల స్వీకరణ: పరిమితి శ్రేణిలో మార్కెట్‌

7 Jul, 2020 09:35 IST|Sakshi

సూచీల 4నెలల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ పరిమితశ్రేణిలో కదలాడుతోంది. సెన్సెక్స్‌ 70 పాయింట్లు లాభంతో 36557 వద్ద నిఫ్టీ 15 పాయింట్లు స్వల్పంగా పెరిగి 10776.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత్‌-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను కలవరపరుస్తున్నాయి. దేశీయంగా మార్కెట్‌ ప్రభావితం చేసే అంశాలేవిలేకపోవడం కూడా సూచీల పరిమిత శ్రేణి ట్రేడింగ్‌కు ఒక కారణమని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్‌కు కొంతవరకు అండగా నిలుస్తున్నాయని వారంటున్నారు.

ప్రైవేట్‌ రంగ బ్యాంక్స్, ఐటీ, ఫైనాన్స్‌, అటో రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంక్స్‌, ఫార్మా, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.11శాతం నష్టంతో 22,175 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

టాటామోటర్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, బజాజ్‌ అటో, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. జీ లిమిటెడ్‌, ఇన్ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టాన్ని చవిచూశాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు