జోరుగా వినోద, మీడియా రంగం

17 Sep, 2014 01:21 IST|Sakshi
జోరుగా వినోద, మీడియా రంగం

న్యూఢిల్లీ: భారత వినోద, మీడియా రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2018 కల్లా ఈ రంగం రూ.2.27 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని సీఐఐ-పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు, టీవీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి దీనికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ఇండియా ఎంటర్‌టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2014 పేరుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), ప్రైస్‌వాటర్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) రూపొందించిన నివేదిక

ముఖ్యాంశాలు..
 2013లో భారత వినోద, మీడియా  రంగం టర్నోవర్ రూ.1.12 లోల కోట్లని అంచనా.  2013-18 కాలానికి 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందన్నది నివేదిక అంచనా.
     
టెలివిజన్ పరిశ్రమలో వృద్ధి జోరు కొనసాగుతుంది. చందా ఆదాయాలు భారీగా పెరిగే అవకాశాలుండడమే(ఏడాదికి 15 శాతం వృద్ధి) దీనికి ఒక కారణం.
     
ఇంటర్నెట్ అందుబాబులోకి రావడం, ఇంటర్నెట్‌లో ప్రకటనల ఆదాయం.. వీటి జోరు బాగా ఉంది. మొదటిది 47 శాతం, రెండోది 26 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధిస్తాయి.
     
భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే.
     
2013లో రూ.35,000 కోట్లుగా ఉన్న ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 2018 నాటికి 13% చక్రగతి వృద్ధితో రూ.60,000 కోట్లకు పెరుగుతుంది.
     
{పింట్ మీడియాను ఇంటర్నెట్ అధిగమిస్తుంది.
     
{పకటనల ఆదాయం అధికంగా టీవీ, ప్రింట్ మీడియాలకే అందుతుంది.
     
2013 నాటికి రూ.12,600 కోట్లుగా ఉన్న చిత్ర పరిశ్రమ టర్నోవర్ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. దేశీయంగా, విదేశాల్లో కూడా సినిమా హాళ్ల ద్వారానే కాకుండా  కేబుల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం కూడా పెరుగుతుంది.
     
స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌ల వినియోగం పెరుగుతుండడంతో గేమింగ్ రంగం ఆదాయం కూడా పెరుగుతుంది.

మరిన్ని వార్తలు