మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!

15 Jun, 2020 09:08 IST|Sakshi
క్యుకి ఎండీ సమీర్ బంగారా (ఫైల్ ఫోటో)

సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, క్యుకి డిజిటల్ మీడియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ బంగారా (46) ఆకస్మిక మరణం వ్యాపార వర్గాలను విభ్రాంతికి గురిచేసింది. ముంబై శివారు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బంగారా కన్నుమూశారు.  ఆయన అకాల మరణంపై కంపెనీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం  చేసింది. 

ఈ విషాదవార్తతో  షాక్ లో వున్నామని క్యుకి మరో కో-ఫౌండర్ సీవోవో సాగర్ గోఖలే ఉద్యోగులకు పంపిన ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ లోటును వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో మనమంతా ఆయన కుటుంబానికి అండగా నిలబడాలన్నారు.  అలాగే కరోనా మహమ్మారి కాలంలో అందరూ ఇంటినుంచే బంగారాకు నివాళులర్పించాలన్నారు.  

అటు సమీర్ బంగారా మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విశాల్ దాడ్లాని, అర్మాన్ మాలిక్, కుబ్రా సైట్, అదితీ సింగ్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. తన స్నేహితుడు, సమీర్ ఇక లేడన్న భయంకరమైన, హృదయ విదారక వార్త తెలిసి చాలా బాధపడుతున్నా అన్నారు. జీవితంలో ఎంతోమందికి సాయం చేసిన మంచి వ్యక్తి అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది విషాదాలను  తలుచుకుంటూ  2020 ఇక చాలు దయచేసి..అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు