ఆ కంపెనీలో 25వేల మంది ఉద్యోగులపై వేటు

17 Aug, 2017 19:03 IST|Sakshi
ఆ కంపెనీలో 25వేల మంది ఉద్యోగులపై వేటు
ఇటీవల కంపెనీలు భారీ ఎత్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. టెక్నాలజీ కంపెనీల్లో చూసిన  ఉద్యోగాల కోతను తాజాగా అంతర్జాతీయ మొబైల్‌ టెలికాం కంపెనీలోనూ కూడా చూడబోతున్నాం. మొబైల్‌ టెలికాం గేర్‌ మేకర్‌ ఎరిక్సన్‌, సుమారు 25వేల మంది ఉద్యోగులపై వేటు వేయబోతుంది. సేవింగ్స్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా స్వీడన్‌కు బయట ఈ ఉద్యోగాల కోతను చేపట్టబోతున్నట్టు కంపెనీకి చెందిన వర్గాలు చెప్పాయి. ఈ విషయాన్ని స్వీడష్‌ డైలీ ఒకటి రిపోర్టు చేసింది. ముఖ్యంగా సర్వీసు డెలివరీలో ఈ ఉద్యోగాల కోత ఉండబోతుంది. 
 
రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లలో దీని ప్రభావం తక్కువగా ఉండబోతుంది. చైనాకు చెందిన హువాయి, ఫిన్లాండ్‌కు చెందిన నోకియా నుంచి పెద్ద ఎత్తున పోటీ పెరగడంతోపాటు మార్కెట్లు ఆశాజనకంగా లేకపోవడం, తర్వాతి తరం 5జీ టెక్నాలజీపై టెలికాం కంపెనీలు తక్కువగా ఖర్చు చేయడం వంటి కారణాలతో ఎరిక్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఏయే దేశాల్లోని ఉద్యోగులపై వేటు వేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. మీడియా ఆపరేషన్లు కూడా ఈ కోతలో భాగమై ఉన్నాయా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు. కాగా, ఎరిక్సన్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.09 లక్షల మంది ఉద్యోగులున్నారు.
మరిన్ని వార్తలు