ఎస్టోనియా జీడీపీ ముకేశ్ అంబానీ సంపద

21 Oct, 2016 02:00 IST|Sakshi
ఎస్టోనియా జీడీపీ ముకేశ్ అంబానీ సంపద

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే నెంబర్ వన్ కుబేరుడైన ముకేశ్ అంబానీ సంపద.. యూరప్‌లోని ఎస్టోనియా దేశ జీడీపీకి (22.69 బిలియన్ డాలర్లు) సమానంగా ఉందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ముకేశ్ అంబానీ సంపద విలువ 22.7 బిలియన్ డాలర్లు. ఈయన తర్వాతి స్థానాల్లో సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ (16.9 బిలియన్ డాలర్లు), హిందూజా కుటుంబం (15.2 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
అలాగే విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 15 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశ జీడీపీ (14.69 బిలియన్ డాలర్లు) కన్నా ఎక్కువ. ఇక ఐదో స్థానంలో పల్లోంజి మిస్త్రీ (13.9 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

మరిన్ని వార్తలు