గూగుల్‌కు భారీ జరిమానా

21 Mar, 2019 09:13 IST|Sakshi

గూగుల్‌కి 1.49 బిలియన్ యూరోల జరిమానా

ఆన్‌లైన్  సెర్చి ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. యూరొపియన్ యూనియన్‌కి చెందిన కాంపిటిషన్ కమిషన్  గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకుగాను యురొపియన్ యూనియన్‌లోని కాంపిటిషన్ కమిషన్ 1.49 బిలియన్ యూరోల  పెనాల్టీ విధించింది.  

గూగుల్‌ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందంటూ.. యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ గూగుల్‌పై  భారీ మొత్తంలో జరిమానా విధించింది.  ఈ మేరకు కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్  బుధవారం ఆదేశాలు జారీచేశారు. గూగుల్‌ తన అధికారాన్ని గూగుల్‌ దుర్వినియోగం  చేస్తోంది.. దాని వల్ల కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తున్నాయన్నారు. వినియోగదారులు మోసపోతున్నారని వెస్టాగర్‌ వెల్లడించారు. కాగా గత రెండేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం ఇది మూడవసారి అని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు