‘ప్రపంచ కుబేరులు ఏ విధంగా ఎదిగారో తెలుసా’

13 Jul, 2020 17:11 IST|Sakshi

ముంబై: ప్రపంచ కుబేరుల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. అయితే 2018లో ఫోర్బ్స్ జాబితాలో కైలీ కాస్మోటిక్స్‌ వ్యవస్థాపకురాలు, రియాలిటీ ఫేమ్‌ కైలీ జెన్నర్‌ పేరు ప్రముఖ్యత సంతరించుకుంది. 21ఏళ్ల కైలీ జెన్నర్‌ అంత పాపులర్‌ కావడానికి ఆమె స్వయం కృషితో ఎదిగినట్లు నామినేషన్‌ వేసి సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రపంచ కుబేరులు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్ గేట్స్, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ వారు ఈ స్థాయికి ఏ విధంగా ఎదిగారో కచ్చితమైన ఆదారాలున్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకుంటు ప్రపంచ కుబేరులుగా ఏ విధంగా ఎదిగారో స్పష్టమైన ఆదారాలున్నాయి.

ఇటీవల ఓ వ్యక్తి  అమెజాన్‌ సంస్థను  బెజోస్‌ చిన్న గ్యారేజిలో  స్థాపించిన ఆధారాలను ఫోటో రూపంలో ఇటీవల సోషల్‌ మీడియాలో ఫోస్ట్‌ చేశాడు. అయితే కైలీ స్వయం కృషితో ఎదిగినట్టు నామినేషన్‌ వేయడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె కర్దాషియన్ వంశానికి చెందిందని, ఆమె 13ఏళ్లలోనే టీవీ రియాల్టీ షోలో పాల్గొని స్వయం కృషితో ఎదిగిందని ఆమె సన్నిహితులు తెలిపారు. అందువల్ల వ్యక్తిగతంగా ఆమెకు స్వయం కృషితో  ఎదిగిన ఇమేజ్‌ వచ్చిందని, కుటుంబ నేపథ్యం చెప్పాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. (చదవండి: బిల్‌ గేట్స్‌ చెప్పిన ఐదు పుస్తకాలు)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా