ఓలాలో సచిన్‌ బన్సల్‌ భారీ పెట్టుబడులు

11 Oct, 2018 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై: క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలాలో దేశీయంగా భారీ పెట్టుబడులను సాధించింది. ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌ , మాజీ సీఈవో సచిన్‌ బన్సల్‌  ఓలాలో పెట్టుబడులకు సిద్ధపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో 5.5శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన అనంతరం సచిన్‌  ఓలాలో  100 మిలియన్‌ డాలర్లను (740కోట్ల రూపాయలను)  ఇన్వెస్ట్‌ చేయనున్నారని సమచారం.  ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం సచిన్‌ బన్సల్‌ ఫ్లిప్‌కార్ట్‌నుంచి వైదొలగిన అనంతరం భారీ ఎత్తున వ్యక్తిగతంగా (10శాతం) పెట్టుబడులను పెట్టనున్నారు. ఓలా ఫౌండర్స్‌  భవిష​ అగర్వాల్‌, అంకిత్‌ అగర్వాల్‌కు సన్నిహితుడైన సచిన్‌ దాదాపు 10శాతం వాటాను కొనుగోలు చేయనున్నారు.  

ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్ తన మొత్తం 5.5 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన అనంతరం కంపెనీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓలా వ్యవస్థాపకులకు జపాన్  ప్రధాన పెట్టుబడిదారు సాఫ్ట్‌బ్యాంకుతో​ ఉన్న స్వల్ప బోర్డు వివాదం బన్సల్‌ రాకతో సమసిపోనుందని భావిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు