బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత

2 Dec, 2016 00:33 IST|Sakshi
బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేత

న్యూఢిల్లీ: బ్రాండెడ్ బంగారు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఉన్న ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 99.5 శాతం అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బ్రాండెడ్ బంగారు కాయిన్లపై ఎక్సైజ్ డ్యూటీ ఇకపై ఉండదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వెండి కాయిన్లకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మినహారుుంపు కొనసాగుతుందని తెలిపింది.

ఇక, బంగారం, వెండి ఆభరణాల తయారీదారులు తయారు చేసే ప్రీషియస్ మెటల్ లేదా మెటల్ ఆధారిత వస్తువులపై మాత్రం ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ చర్యతో బంగారు కారుున్లు చౌకగా మారతాయని, వ్యవస్థీకృత రంగాన్ని ప్రోత్సాహాన్నిస్తుందని పీజీ జ్యుయలర్ ఎండీ బల్‌రామ్‌గార్గ్ అన్నారు. వాస్తవంగా బ్రాండెడ్ ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని 2011లో అమల్లోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు