భారత్‌ వృద్ధి అంచనా యథాతథం

25 Jul, 2017 01:56 IST|Sakshi
భారత్‌ వృద్ధి అంచనా యథాతథం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) భారత వృద్ధి రేటును యథాతథంగా 7.2 శాతంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో ఇది 7.7 శాతానికి చేరుతుందని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈవో) అప్‌డేట్‌ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లూ కూడా భారత వృద్ధి రేటు చైనా కన్నా అధికంగానే ఉండనుంది.

 చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగాను, 2018లో 6.4 శాతంగాను ఉండగలదంటూ గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్‌ స్వల్పంగా పెంచింది. భారత వృద్ధి రేటు అంచనాలను గతంలో ఇచ్చిన స్థాయిలోనే యథాతథంగానే ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైనప్పటికీ.. ఇది ఊహించిన దానికన్నా అధికమేనని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు