మల్టీ బ్యాగర్‌ బదులు.. మంచి ఫండ్‌ చూసుకోండి!

2 Jul, 2018 00:50 IST|Sakshi

నా వయస్సు 50 సంవత్సరాలు. మరో పదేళ్లలో రిటైర్‌ కాబోతున్నాను. దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయని చెబుతుంటారు.  అయితే ఇలా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న నాలాంటి వాళ్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా దీర్ఘకాలం అంటే అర్థవంతంగా ఉంటుందా ? రిటైర్మెంట్‌ నిధి కోసం నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎలా ఉండాలి ?
–శ్రీధర్, విశాఖపట్టణం  
ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అయితే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న వాళ్ల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఉదాహరణకు మీ విషయమే తీసుకుంటే,  మీ వయస్సు 50 సంవత్సరాలు. మీరు మరో పదేళ్లలో రిటైర్‌ కాబోతారు కాబట్టి, మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేయాలి. ఈక్విటీ, బాండ్ల కలగలుపుగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మీరు ఏడాదికి 4–5 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఉండాలి. ఇలా చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వృద్ధి చెందే అవకాశాలున్నాయి.  

మనం ఇన్వెస్ట్‌ చేసిన షేర్‌ మల్టీ బ్యాగర్‌ అవుతుందా లేక మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మట్టికరిపిస్తుందా ముందే మనకు తెలిసే వీలుందా ? అలా తెలుసుకోవడానికి ఏమైనా పద్ధతులున్నాయా ? –అవినాశ్, విజయవాడ  
అలా తెలుసుకోవడం కష్టసాధ్యమైన విషయమే. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మట్టికరవకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఈ ప్రమాదం నుంచి బైటపడవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొంది దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. ఒక సాధారణ ఇన్వెస్టర్‌గా మల్టీ బ్యాగర్‌ను అంచనా వే యడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చు.

షేర్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే దీని కంటే మరో మంచి మార్గం మంచి ఫండ్‌ను ఎంచుకోవడం. మంచి ఫండ్‌ను ఎంచుకొని, ఆ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించండి. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కూడా పెంచండి. మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంతో అనుభవమున్న ఫండ్‌ మేనేజర్‌ నిర్వహిస్తాడు. కాబట్టి ఒక సాధారణ ఇన్వెస్టర్‌ కన్నా మంచి నిర్ణయాలు తీసుకోగలడు.  

నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టుకోవాలనేది నా లక్ష్యం. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని మిత్రులు చెబుతున్నారు. అందుకని నేను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?     –ఆనంద్, హైదరాబాద్‌
దాదాపు రెండు వేలకు పైగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. దీర్ఘకాలం అంటే కనీసం ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. స్వల్పకాలంలో ఈక్విటీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురువుతాయి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, ఈ సమస్యను అధిగమించవచ్చు. 

ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసేముందు మూడు  కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది ట్యాక్స్‌ ప్లానింగ్‌. చాలా మంది పన్ను ఆదా కోసమే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో పన్ను ఆదా ఫండ్స్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇక రెండోది మీరు ఎంత రిస్క్‌ను భరించగలరనే విషయం. డెట్‌ ఫండ్స్‌లో నష్టభయం తక్కువగా ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌లో రిస్క్‌ రకరకాలుగా ఉంటుంది. బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువగానూ, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ అధికంగానూ ఉంటుంది.

మీది ఇంకా చిన్న వయస్సే,  కాబట్టి ఎక్కువ రిస్క్‌ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కాలం అధికంగా ఉండి చక్రగతి వృద్ధి రాబడులు పొందవచ్చు. ఇక చివరిది ఫండ్స్‌ పనితీరును సమీక్షించడం. కనీసం ఏడాదికొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌ పనితీరును మదింపు చేయాలి. ఆశించిన స్థాయిలో పనితీరు లేని ఫండ్స్‌ నుంచి వైదొలగి, వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి.  

ఊరిలో పొలం అమ్మగా నా వాటా కింద రూ. 5 లక్షలు వచ్చాయి. వీటిని ఒకేసారి హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి.      –లక్ష్మీ ప్రసన్న, కాకినాడ  
ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో నెలకు కొంత మొత్తంలో ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఈక్విటీ ఒడిదుడుకుల సమస్యను అధిగమించవచ్చు. ఒకోసారి పెద్ద మొత్తంలో సొమ్ములు సమకూరాయనుకోండి. ఆ మొత్తాన్ని బట్టి సిప్‌ల సంఖ్యను నిర్ణయించుకోవాలి.

ఉదాహరణకు మీకు రూ. 50,000–1,00,000 వరకూ బోనస్‌ వచ్చిందనుకుందాం. ఈ మొతాన్ని 3–6 భాగాలుగా విభజించి సిప్‌ ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి.  స్టాక్‌ మార్కెట్‌ సైకిల్‌ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది కాబట్టి పొలం అమ్మగా వచ్చిన   రూ.5 లక్షల మొత్తాన్ని  మూడు సంవత్సరాల పాటు సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి.   


- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌