రిలయన్స్‌ ఔట్‌.. ఫండ్స్‌పై ప్రభావం ఉంటుందా?

17 Jun, 2019 12:33 IST|Sakshi

నేను, నా భార్య సీనియర్‌ సిటిజన్‌లం. మేం గత కొన్నేళ్లుగా నాలుగు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. అవి యాక్సిస్‌ లాంగ్‌టెర్మ్‌ ఈక్విటీ, ఫ్రాంక్లిన్‌ ఇండియా ట్యాక్స్‌షీల్డ్, ఐసీఐసీఐ ప్రు ఈక్విటీ అండ్‌ డెట్,  సుందరమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌. ఈ ఫండ్స్‌ ప్రస్తుతం మంచి పనితీరే కనబరుస్తున్నాయి. ఈ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? వేరే ఫండ్స్‌లోకి మళ్లించమంటారా ? పన్ను ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.      –సుందర్, విజయవాడ  

మీరు చెప్పిన వాటిల్లో మొదటి రెండు ఫండ్స్‌– యాక్సిస్‌ లాంగ్‌టెర్మ్‌ ఈక్విటీ, ఫ్రాంక్లిన్‌ ఇండియా ట్యాక్స్‌ షీల్డ్‌ ఫండ్స్‌... పన్ను ఆదా ఫండ్స్‌. వీటికి మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. మీకు పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఒక సీనియర్‌ సిటిజన్‌గా మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు అవసరమవుతాయి. అందుకని మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకోకుండా ఉండే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం అనవసరం కదా !  రిటైరైన వాళ్లకు, పన్ను ప్రయోజనాలు అవసరం లేనివాళ్లకు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ ఫండ్స్‌ సరైనవి కాదు. సాధారణంగా పెద్ద వయస్సు ఇన్వెస్టర్లు మార్కెట్లో భారీ పతనాలను తట్టుకోలేరు. కానీ మార్కెట్‌ నష్టపోతే, ఆ రిస్క్‌ను భరించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌  పడిపోయినా, తగిన రక్షణ లభిస్తుంది. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో ఒకటి లేదా రెండు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను జత చేయండి. 

గత నాలుగేళ్లుగా రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇప్పటివరకూ రూ. ఆరు లక్షల మేర ఇన్వెస్ట్‌ చేశాను. దీని విలువ ఇప్పుడు రూ.5.70 లక్షలుగా ఉంది. ఈ ఫండ్‌ రాబడులు సంతృప్తికరంగా లేకపోవడంతో దీంట్లో సిప్‌లను ఆపేసి మిరా ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. రిలయన్స్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారం నుంచి వైదొలగిందని వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ సంస్థ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి వైదొలగడం  సదరు ఫండ్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా ?–జాహ్నవి, హైదరాబాద్‌ 

జపాన్‌కు చెందిన నిప్పన్‌ సంస్థ ప్రవేశంతో కొన్నేళ్ల క్రితం రిలయన్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా ఉన్న కంపెనీ రిలయన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌  కంపెనీగా మారింది. ఆ తర్వాత ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. ఇప్పుడు రిలయన్స్‌ సంస్థ, తన వాటాను నిప్పన్‌కు విక్రయించి మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతోంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఇటీవలే కుదిరింది. ఇక ఈ వ్యాపారంలో పూర్తి నియంత్రణ నిప్పన్‌ కంపెనీకే ఉంటుంది. అయితే యాజమాన్యంలో మార్పు, చేర్పులు ఫండ్స్‌పనితీరుపై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ పనితీరు ఏమంత సంతృప్తికరంగా లేదు. కేవలం పన్ను ఆదా ప్రయోజనాలే పరమావధిగా ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది. పన్ను ఆదా ఫండ్‌ అయినప్పటికీ, ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో అధికంగా స్మాల్, మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఫండ్స్‌ కొంత కాలం తర్వాత మంచి రాబడులే ఇస్తాయి. అంతకు ముందటి కాలంలో మాత్రం పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక మీ విషయానికొస్తే, మీరు ఇప్పుడు చెయ్యగలిగిందేమీ లేదు. ఇది ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌ కాబట్టి... మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. మీరు నాలుగేళ్లుగా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి మీరు మొదటి ఏడాది ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాన్ని మాత్రమే వెనక్కి తీసుకోగలరు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలంటే మీరు మరో మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. అయితే అప్పటికల్లా ఈ ఫండ్‌ రాబడులు మరింతగా పెరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. 

నేను సీనియర్‌ సిటిజన్‌ను. రెండు నుంచి మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి ఫ్రాంక్లిన్‌ ఇండియా షార్ట్‌–టెర్మ్‌ ఫండ్‌ను ఎంచుకున్నాను. రెండు నుంచి మూడేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ ఫండ్‌ను ఎంచుకోవడం సరైనదేనా ?    –రియాజ్, విశాఖపట్టణం  
మీ ఎంపిక సరైనదే. ఈ ఫండ్‌ పనితీరు బాగానే ఉంది. ఫిక్స్‌డ్‌–ఇన్‌కమ్‌ సాధనాలకు సంబంధించిన ఫండ్స్‌ నిర్వహణలో ఫ్రాంక్లిన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు మంచి పేరే ఉంది. అయితే మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని రెండు భాగాలుగా చేయండి. కనీసం 60 శాతాన్ని ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మిగిలిన 40శాతాన్ని వేరే ఫండ్‌లో లేదా పోస్ట్‌ ఆఫీస్‌  మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌(పీఓఎమ్‌ఐఎస్‌), సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీరు భారత ప్రభుత్వానికే రుణం ఇచ్చినట్లవుతుంది. ఈ సాధనాల్లో   ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఎలాంటి రిస్క్‌ ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితం. ఒక వేళ వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ పరిమితి మేరకు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పూర్తయితే, మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని  ఫిక్స్‌డ్‌–ఇన్‌కమ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీరు ఎంచుకున్న ఫ్రాంక్లిన్‌ ఇండియా షార్ట్‌–టెర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌ మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు