ఎగుమతులు డీలా...

17 Jun, 2015 01:35 IST|Sakshi
ఎగుమతులు డీలా...

మే నెలలో 20శాతం క్షీణత
- ఆరు నెలలుగా ఇదే ధోరణి
- దిగుమతులూ 17 శాతం మైనస్సే
- వాణిజ్యలోటు 10 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ:
ఎగుమతులు క్షీణిస్తూ... ఆర్థిక వ్యవస్థలోని నిరాశాజనక పరిస్థితిని మరోమారు స్పష్టంచేశాయి. అంతర్జాతీయ మందగమన ధోరణికి అద్దం పడుతూ, ఎగుమతులు ఏకంగా 20 శాతం క్షీణించాయి. దేశీయంగా డిమాండ్ లేకపోవటంతో దిగుమతులు సైతం 17 శాతం క్షీణించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలివీ...

- 2014 మేలో ఎగుమతుల విలువ 27.99 బిలియన్ డాలర్లు. 2015 మేలో ఈ విలువ 22.34 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే అసలు వృద్ధిలేకపోగా 20 శాతంపైగా క్షీణించాయన్నమాట. ఎగుమతుల విలువ తగ్గడానికి అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో పాటు, క్రూడ్ ధరలు కూడా దిగువ స్థాయిలో కొనసాగుతుండడం కారణం. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువగా ఉన్నాయి. మెటల్, పలు కమోడిటీ ధరలు కూడా తగ్గాయి.
- 2014 మే నెల్లో దిగుమతులు 39.23 బిలియన్ డాలర్లు. ఇవి 2015 మే నెలలో 32.75 బిలియన్ డాలర్లకు పడ్డాయి. అంటే అసలు పెరుగుదల లేకపోగా 17 శాతం క్షీణించాయి. 2014 ఫిబ్రవరి తరువాత దిగుమతులు ఇంత తీవ్ర స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి.
- వెరసి ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు 10.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 2015 ఏప్రిల్ నెలలో ఈ పరిమాణం 11 బిలియన్ డాలర్లయితే, 2014 మే నెలలో ఈ విలువ 11.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
- మే నెలలో ప్రధాన ఎగుమతుల రంగాలైన పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్, కెమికల్స్ ప్రతికూల ఫలితాలను చూశాయి.
- చమురు దిగుమతుల విలువ 40,97 శాతం తగ్గి 8.53 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురుయేతర దిగుమతుల విలువ సైతం 2.24 శాతం పడి, 24.21 బిలియన్ డాలర్లుగా ఉంది.
- కాగా 2014 మేతో పోల్చితే బంగారం దిగుమతులు 10.47 శాతం పెరిగి 2,19 బిలియన్ డాలర్ల నుంచి 2.42 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
 
రెండు నెలల్లో...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు- ఏప్రిల్, మేలలో ఎగుమతులు (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చి) 17 శాతం పడ్డాయి. విలువ 44.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 12 శాతం క్షీణించాయి. ఈ విలువ 65.8 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 21.4 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్‌ఐఈఓ
కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు ఎస్‌సీ రల్‌హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు