ఎగుమతుల్లో కొనసాగుతున్న నిరుత్సాహం

19 Apr, 2016 01:51 IST|Sakshi
ఎగుమతుల్లో కొనసాగుతున్న నిరుత్సాహం

వరుసగా 16 నెలా క్షీణతే...
* మార్చిలో -5.47 శాతంగా నమోదు
* 2015-16లో 16 శాతం పతనం

న్యూఢిల్లీ: ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణ ధోరణి వరుసగా 16వ నెల మార్చిలోనూ కొనసాగింది. అసలు వృద్ధిలేకపోగా -5.47 శాతం క్షీణత నమోదయ్యింది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చిలో 2015-15 ఇదే కాలంతో పోల్చితే) ఎగుమతుల్లో -16 శాతం క్షీణత నమోదయ్యింది.
 
ఒక్క మార్చిని చూస్తే...

ఎగుమతులు -5 శాతం క్షీణతతో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా క్షీణ బాటలోనే ఉన్నాయి. - 22 శాతం పతనంతో  28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి-దిగుమతుల మధ్య విలువ వ్యత్యాసం వాణిజ్యలోటు 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల క్షీణత మొత్తం పరిణామంపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితి దీనికి కారణం. చమురు దిగుమతుల విలువ 36 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు యేతర దిగుమతుల విలువ 18 శాతం క్షీణతలో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
 
ఆర్థిక సంవత్సరంలో ఇలా...
2015-16 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ ఎగుమతులు 16 శాతం క్షీణించాయి. 310 బిలియన్ డాలర్ల నుంచి 261 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా ఇదే స్థాయిలో క్షీణించి 380 బలియన్ డాలర్లకు పడ్డాయి. దీనితో వాణిజ్యలోటు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో 119 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
 
బంగారం వెలవెల...
కాగా మార్చిలో పసిడి దిగుమతులు 80 శాతం క్షీణించాయి. 5 బిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల దిగువకు      పడిపోయాయి.
 
17వ నెలా మైనస్‌లోనే టోకు ద్రవ్యోల్బణం

* మార్చిలో -0.85% నమోదు  
* క్రూడ్, తయారీ విభాగాల్లో తక్కువ ధరల పతనం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు  మార్చిలోనూ అసలు పెరుగుదల లేకపోగా ‘మైనస్’ను నమోదుచేసుకుంది. ఈ  నెలలో రేటు క్షీణతలో -0.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 మార్చితో పోల్చితే 2016 మార్చిలో ధరల సూచీ అసలు పెరక్కపోగా... తగ్గిందన్నమాట. ఇటువంటి ధోరణి ఇది వరుసగా 17నెల. క్రూడ్, తయారీ విభాగాల ధరలు దిగువస్థాయిలో ప్రతిబింబించడం దీనికి ప్రధాన కారణం. కాగా కూరగాయలు, ఆహార ధరలు రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూచీ రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణుల వాదన.
 
వార్షికంగా 3 విభాగాలూ వేర్వేరుగా..
 ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో కూడిన ఈ విభాగం రేటు 2015 మార్చిలో క్షీణతలో -0.17 శాతంగా ఉంటే ఇప్పుడు ఈ రేటు 2.13 శాతానికి ఎగసింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ రేటు 6.27 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గింది. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -6.94 శాతం క్షీణత నుంచి 8.09 శాతం పైకి చేరింది.
 ఇంధనం, లైట్: ఈ రేటులో క్షీణ రేటు -12.23 శాతం నుంచి -8.30కి చేరింది.
 తయారీ: ఈ విభాగంలో క్షీణత రేటు సైతం -0.19 శాతం నుంచి 0.13 శాతానికి దిగింది.
 
ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలు ఇలా...
కూరగాయల ధరలు వార్షికంగా అసలు పెరక్కపోగా -2.26 శాతం తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.47 శాతం, పప్పు దినుసుల ధరలు 35 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 18 శాతం, పండ్ల ధరలు 2 శాతం తగ్గాయి.

మరిన్ని వార్తలు