ఇంటెల్ చేతికి ఆల్టెరా.. 16.7 బిలియన్ డాలర్ల డీల్

2 Jun, 2015 02:18 IST|Sakshi
ఇంటెల్ చేతికి ఆల్టెరా.. 16.7 బిలియన్ డాలర్ల డీల్

న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ తాజాగా ఆల్టెరా కార్ప్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 16.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. 47 సంవత్సరాల కంపెనీ చరిత్రలో ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఆల్టెరా షేరు ఒక్కింటికి ఇంటెల్ 54 డాలర్లు చెల్లించనుంది. ఇందుకోసం ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటెల్ తెలిపింది. డేటా సెంటర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) తదితర వ్యాపార విభాగాల కస్టమర్లకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని పేర్కొంది.

ఫోన్ నెట్‌వర్క్‌లు, సర్వర్ సిస్టమ్స్, కార్లు మొదలైన వాటికి అవసరమయ్యే ప్రాసెసర్లను ఆల్టెరా డిజైన్ చేస్తుంది.

మరిన్ని వార్తలు