హ్యాపీబర్త్‌డే ఎఫ్‌బీ..

4 Feb, 2019 19:02 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది యూజర్లను అక్కున చేర్చుకున్న సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నెట్టింట అడుగుపెట్టి 15 సంవత్సరాలైంది. 2004, ఫిబ్రవరి 4న ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఎఫ్‌బీని ఆన్‌లైన్‌లో పరిచయం చేయడంతో సోషల్‌ మీడియా దిగ్గజం ప్రస్ధానం ప్రారంభమైంది.

ఆరంభంలో అంకుర సంస్ధగా బుడిబుడి అడుగులు వేసిన ఫేస్‌బుక్‌ ఒకటిన్నర దశాబ్ధంలో కోట్లాది మందికి చేరువైంది. ప్రపంచ జనాభాలో మూడోవంతు ప్రజల దైనందిన జీవితాల్లో ఈ సోషల్‌ మీడియా దిగ్గజం భాగమైంది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఫేస్‌బుక్‌ విలువ 500 బిలియన్‌ డాలర్లు కాగా, ఏటా 22 బిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని ఆర్జిస్తోంది. ఫేస్‌బుక్‌ వ్యవస్ధాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యక్తిగత సంపద 62 బిలియన్‌ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు