‘ఎఫ్‌బీ బాస్‌కు ఓటింగ్‌ గండం’

30 May, 2019 12:56 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వైదొలిగే పరిస్థితి నెలకొంది. గురువారం జరిగే సంస్థ వార్షిక సమావేశంలో లీడర్‌షిప్‌ ఓటు ద్వారా మార్క్‌ జుకర్‌బర్గ్‌కు సవాల్‌ ఎదురవనుంది. గోప్యత నిబంధనల ఉల్లంఘనలను జుకర్‌బర్గ్‌ నాయకత్వంలో ఎఫ్‌బీ దీటుగా ఎదుర్కోలేకపోతోందని వాటాదారుల్లో అసంతృప్తి ఎటు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కాగా కంపెనీ షేర్లలో జుకర్‌బర్గ్‌కు 60 శాతం వాటా ఉండటంతో లీడర్‌షిప్‌ ఓటులో ఆయన నాయకత్వానికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావని బీబీసీ పేర్కొంది.

జుకర్‌బర్గ్‌కు వ్యతిరేకంగా ఎంతశాతం వాటాదారులు ఓటు వేశారనేది ఆయన నాయకత్వానికి గీటురాయి కానుందని తెలిపింది. జుకర్‌బర్గ్‌ చైర్మన్‌గా వైదొలగాలని 70 లక్షల డాలర్ల విలువైన షేర్లు కలిగిన ట్రిలియమ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతిపాదించింది. ఫేస్‌బుక్‌ సెక్యూరిటీ మాజీ చీఫ్‌ అలెక్స్‌ స్టామోస్‌ కూడా జుకర్‌బర్గ్‌ చైర్మన్‌గా వైదొలగాలని కోరుతున్నారు. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై నియంత్రణను జుకర్‌బర్గ్ కొంత వదులుకుని, నూతన సీఈఓను నియమించాలని కోరారు.

>
మరిన్ని వార్తలు