అకౌంట్‌ లేకపోయినా.. మీ గుట్టు రట్టు!

17 Apr, 2018 10:30 IST|Sakshi

వినియోగదారుల డేటా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఆరోపణలను ఎట్టకేలకు ఫేస్‌బుక్‌ యాజమాన్యం అంగీకరించింది. అయితే తమ సోషల్‌ నెట్‌వర్క్‌ ఖాతాదారుల డేటా ఏ విధంగా సేకరిస్తాయో తెలియజేస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘మా సేవలను వినియోగించుకుంటున్న సైట్లనుగానీ, యాప్‌లను గానీ ఎవరైనా ఓపెన్‌ చేస్తే చాలూ వారి వ్యక్తిగత సమాచారం మాకు చేరిపోతుంది. ఫేస్‌ బుక్‌ లాగ్డ్‌ అవుట్‌ అయినా.. అసలు అకౌంటే లేకపోయినా అది సాధ్యమవుతుంది. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. 1. ఆయా సైట్లకు, యాప్‌లకు ఫేస్‌ బుక్‌ సేవలు అందించటం. 2. ఫేస్‌బుక్‌లో భద్రతా చర్యలను పటిష్టపరిచటం. 3. మా సొంత ఉత్పాదకాలను విస్తృతపరిచే క్రమం.. ఈ మూడు సందర్భాల్లో వినియోగదారుడి సమాచారం ఆటోమేటిక్‌గా మాకు చేరుతుంది ’ అని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బసర్‌ ఓ పోస్ట్‌లో తెలియజేశారు. 

తద్వారా మిగతా యాప్‌లు, సైట్లు.. ఫేస్‌బుక్‌ను ఎవరెవరు వాడుతున్నారన్న విషయాన్ని కనిపెట్టలేకపోతున్నాయని ఆయన అన్నారు. అయితే యాడ్‌ల కోసం కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయన్న ఆయన.. గూగుల్‌.. ట్వీటర్‌ లాంటి దిగ్గజాలు కూడా ఈ విధానాన్నే అవలంభిస్తాయని చెబుతున్నారు. మరోపక్క వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలను మాత్రం డేవిడ్‌ బసర్‌ ఖండించారు.

మరిన్ని వార్తలు