జియోపై కన్నేసిన ఫేస్ బుక్ : కరోనా దెబ్బ

25 Mar, 2020 11:20 IST|Sakshi

జియోలో 10 శాతా వాటా కొనుగోలు చేయనున్న ఫేస్ బుక్

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ  దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  పై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కన్నేసింది. లక్షల కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేసుందుకు ఫేస్ బుక్ సిద్ధమవుతోంది. తద్వారా దేశంలో   డిజిటల్ ఆపరేషన్స్ లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్ బుక్  యోచిస్తోంది.  ఫైనాన్షియల్ టైమ్స్   సమాచారం ప్రకారం భారతీయ డిజిటల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకునేందుకు ముకేశ అంబానీ  డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోలో మల్టి బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి  చర్చలు జరుపుతోంది. ఈ నెలాఖరులో ఫేస్‌బుక్‌తో ఈ ఒప్పందం  జియో ప్రకటించాల్సి ఉంది.

మార్చి 2021 నాటికి  రిలయన్స్ సంస్థ అప్పులేని సంస్థగా మార్చే ప్రణాళికల్లో   ఈ   విక్రయం చోటు చేసుకోనుందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజం ఫేస్ బుక్ 10 శాతం వాటా కోసం ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేయడానికి  సిద్ధంగా వుందని, అయితే  కోవిడ్ -19 కరోనావైరస్ వ్యాప్తి  ప్రపంచ ప్రయాణ నిషేధాల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయాయని తెలిపింది. అయితే  ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి  రిలయన్స్ ప్రతినిధి నిరాకరించినట్టు తెలుస్తోంది. వ్యాపారాలకు క్లౌడ్ కంప్యూటింగ్‌ను అందించడానికి జియోతో భాగస్వామ్యంపై  చర్చలు జరుపుతున్నట్టు మైక్రోసాఫ్ట్   గత ఏడాది ప్రకటించిన తరువాత ఈ వార్తలు వెలుగులోకి రావడం విశేషం. 

2016లో  దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్  జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లోకి టాప్ లోకి  దూసుకు వచ్చింది.  మొబైల్ టెలికాంతోపాటు,  హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఇకామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది.  అంతేకాదు యుఎస్ టెక్ గ్రూపులతో పోటీ పడగల ఏకైక సంస్థగా రిలయన్స్ అవతరించింది. 

మరిన్ని వార్తలు