మోసగాళ్లకు చెక్ : మెసెంజర్‌లో కొత్త ఫీచర్

21 May, 2020 20:02 IST|Sakshi

ఫేస్‌బుక్  కొత్త సేఫ్టీ ఫీచర్

మెసెంజెర్ యాప్‌లో మోసగాళ్లను పట్టేసే ఏఐ  సాఫ్ట్‌వేర్ అలర్ట్

అనుమానాస్పద సందేశాలకు స్పందించకముందే  పాపప్

మెసెంజర్‌లో అవాంఛిత పరిచయాలు, మోసాలను నివారించడమే లక్ష్యం

సాక్షి, న్యూఢిల్లీ: ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్  తన మెసెంజెర్ యాప్‌లో కొత్త భద్రతా చర్యలను ప్రారంభించింది..యూజర్లకు తెలియకుండా తెర వెనుక జరిగే మోసాలను గుర్తించి, యూజర్లను అలర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ ద్వారా  వీటిని  మనిస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా భావిస్తే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సంబందిత  యూజర్ ను హెచ్చరిస్తుంది.  మెసెంజర్ టెక్స్ట్ చాట్‌లలో సేఫ్టీ సందేశాలు పాపప్ అవుతాయని  ప్రైవసీ అండ్ సేఫ్టీ  నిర్వహణ డైరెక్టర్ జే సుల్లివన్ తెలిపారు. సంభాషణలను స్కామర్లు ఎవరూ వినకుండా , గమనించకుండా స్నేహితులు , ప్రియమైనవారితో సురక్షితంగా ప్రైవేటుగా కమ్యూనికేట్ చేయగలగాలన్నారు. ముఖ్యంగా మైనర్ యూజర్ల  భద్రత తమకు ముఖ్యమన్నారు.

సంబంధిత ఖాతారుదారుడు పంపించే మెసేజెస్, ప్రాంతం, అకౌంట్ నైజం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్  స్కామర్లను గుర్తిస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది. అలాంటి మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించక ముందే హెచ్చరిక నోటీసులు పాపప్ అవుతాయని,దీన్ని యూజర్లుగమనించాలని పేర్కొంది. ఈ ఫీచర్ తమ మిలియన్ల యూజర్లను భారీమోసాలు, హానికరమైన చర్యలనుంచి  కాపాడుతుందని ప్రకటించింది.  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోఉన్న ఈ ఫీచర్ వచ్చే వారం ఐఫోన్‌లలోని మెసెంజర్‌లో కూడా ప్రారంభిస్తామని ఫేస్‌బుక్  వెల్లడించింది. 

మరిన్ని వార్తలు