ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో కొత్త ఫీచర్‌

16 Oct, 2018 18:38 IST|Sakshi

మెసేజ్‌ డిలీట్‌ ఆప్షన్‌

అచ్చం వాట్సాప్‌లో లాగానే

సోషల్‌మీడియా నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌ తన మెసేజింగ్‌ ప్లాట్‌పాం మెసేంజర్‌లో  కొత్త ఫీచర్‌ను  జోడించనుంది. వాట్సాప్‌  మాదిరిగానే మెసేజ్‌లకు సంబంధించి అన్‌సెండ్‌ ఆప్షన్‌ను  పరిశీలిస్తోంది.  ఈ కొత్త ఫీచర్  యూజర్లు అప్పటికే సెండ్‌ చేసిన సందేశాన్ని తొలగించడానికి అనుమతిస్తుంది. ఇన్‌బాక్స్‌నుంచి ఒక మెసేజ్‌ను డిలీట్‌ చేయడంతోపాటు, అన్‌సెండ్‌ ఆప్షన్‌తో గ్రహీత ఇన్‌బాక్స్‌నుంచి తొలగించేందుకు కూడా అనుమతిస్తుంది. వాట్సాప్‌లో డిలీట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌లాంటిదే ఇది కూడా. అలాగే ఇలా చేయడానికి అచ్చం వాట్సాప్‌లోలాగానే  సమయ పరిమితి ఉంటుందిట.  అయితే ఈ టైంను సంస్థ ఇంకా ప్రకటించలేదు. 

కాగా వాట్సాప్‌  సందేశాలకు  తొలగింపునకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను జోడించింది.  పొరపాటున మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే ఆ  మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్‌ చేసుకునే అవకాశాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇప్పటివరకు ఇలా సెండ్‌ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది.  డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు