ఫేక్‌ న్యూస్‌ : ఈపీఎఫ్‌ఓ రూ. 80వేలు ఆఫర్‌

2 Nov, 2019 11:11 IST|Sakshi

ఈపీఎఫ్‌వో  ఖాతాదారులకు హెచ్చరిక!

సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగులకు తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందంటూ  సోషల్‌   మీడియాలో ఒక సందేశం విపరీతంగా షేర్‌ అవుతోందని.. ఇది  ఫేక్‌ అని తేల్చి చెప్పింది. ఇలాంటి సత్యదూరమైన మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని  సూచించింది. తామెలాంటి ఆఫర్లను అందించడం లేదని స్పష్టం చేసింది. 

ఈపీఎఫ్ఓ చందాదారులకు బంపర్‌ అఫర్‌అంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో ఖాతాదారులు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన  సంస్థ ఇది ఫేస్‌ న్యూస్‌ అని,  ఇలాంటి పుకార్లను నమ్మవద్దవని స్పష్టం చేసింది. అలాగే ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ  కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించరాదని ఖాతాదారులను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్‌ ద్వారా ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా