ఫేస్‌బుక్‌ను శాశ్వతంగా డిలీట్‌ చేశా: నటుడు

27 Mar, 2018 11:22 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, ముంబై: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌​ డేటా బ్రీచ్‌ దుమారం బాలీవుడ్‌ను తాకిందనిపిస్తోంది.   తాజాగా బాలీవుడ్‌ నటుడు ఫరాన్‌ అక్తర్‌ (44) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు.  ఫేస్‌బుక్‌  ఖాతాను డిలీట్‌ చేస్తున్నానంటూ  మంగళవారం సోషల్‌ మీడియా లో వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌  పోస్ట్‌ పెట్టారు.  తన ఫేస్‌బుక్‌ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ తన  అకౌంట్‌ పేజ్‌ ఇంకా ఉనికిలో ఉందంటూ ట్వీట్‌ చేశారు.  అయితే ఎందుకు  తన ఖాతాను  తొలగించిందీ స్పష్టం చేయలేదు. కానీ ఇప్పటికే గ్లోబల్‌గా డిలీట్‌  ఫేస్‌బుక్‌ ఉద్యమం ఉధృతమవుతుండగా ఈ సెగ ఇపుడు బాలీవుడ్‌కు పాకిందనే అంచనాలు మాత్రం  భారీగా నెలకొన్నాయి.

మరోవైపు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ, ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌కు గుడ్‌ బై చెప్పారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్విటర్‌లో  స్పందించారు.    సింగర్, నటి చెర్‌తోపాటు మరికొందరు కూడా ఇదే బాటలో నిలిచారు.

కాగా  2016  అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 50 మిలియన్ల ఫేస్‌బుక్ వినియోగదారులు  డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికా దక్కించుకుందున్నవార్త గ్లోబల్‌గా కలకలం రేపింది. దీనిపై అమెరికా ఫెడరల్‌   యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ విచారణను మొదలుపెట్టింది.

మరిన్ని వార్తలు