నిస్సాన్‌ మైక్రాలో ఫ్యాషన్‌ ఎడిషన్‌

13 Sep, 2017 00:24 IST|Sakshi
నిస్సాన్‌ మైక్రాలో ఫ్యాషన్‌ ఎడిషన్‌

గుర్గావ్‌: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్‌ ఇండియా’ తాజా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ‘మైక్రా’లో ఫ్యాషన్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటెన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర రూ.6.09 లక్షలు. మైక్రా ఫ్యాషన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌లో మెకానికల్‌గా మార్పులేవీ లేకున్నా పలు కాస్మొటిక్‌ అప్‌గ్రేడ్స్‌ (ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌) ఉన్నట్లు కంపెనీ తెలిపింది.  కొత్త మైక్రా ప్రధానంగా ఫ్యాషన్‌ బ్లాక్, ఫ్యాషన్‌ ఆరంజ్‌ రంగుల్లో  లభ్యంకానుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు