యూపీఎల్‌ షేరు 10శాతం క్రాష్‌

19 May, 2020 15:47 IST|Sakshi

27రకాల పురుగుమందులపై కేంద్రం నిషేధం 

10శాతం నష్టపోయిన యూపీఎల్‌

సస్య రక్షణ ఔషధ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సుమారు 27రకాల పురుగుమందుల అమ్మకం, వాడకం, దిగుమతులను నిషేధిస్తూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్‌ వెల్‌ఫేర్‌ మంత్రిత్వ శాఖ  మే14వ తేదిన ముసాయిదా ఉత్తర్వులు జారీ చేయడం ఈ రంగ షేర్ల పతనానికి కారణమైంది.  

ఈ రంగానికి చెందిన యూపీఎల్‌, రాలీస్‌ ఇండియా, అతుల్‌ లిమిటెడ్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీల షేర్లు 10శాతం నుంచి 4శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పటికే యూపీఎల్‌ షేరు ఏడాది కాలంలో ఏకంగా 47శాతం నష్టపోయింది.  

"ఈ ఆర్డర్ ప్రచురించిన తేదీ(మే 14) నుండి షెడ్యూల్ లో పేర్కొన్న పురుగుల మందులను ఏ వ్యక్తి కూడా దిగుమతి, తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వియోగం లాంటి చేయకూడదు" అని నోటిఫికేషన్లు తెలిపాయి.

కేంద్రం రూపొందిచిన ముసాయిదా అమల్లోకి వస్తే.., నిషేధిత పురుగుమందుల ఉత్పత్తులను తయారు చేసే యూపీఎల్‌, రాలీస్‌ ఇండియా, అతుల్‌, కోరమాండల్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలపై నిషేధం ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు