జీఎస్‌టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు..!

3 Oct, 2018 00:34 IST|Sakshi

నవంబర్, డిసెంబర్‌ వసూళ్ల అంచనా

పండుగలు, పన్ను ఎగవేతలు తగ్గడం ఆధారంగా లెక్కలు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వచ్చే నెలలో రూ.లక్ష కోట్లను మించిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో జీఎస్‌టీ ఆదాయం లక్ష కోట్ల మార్కును దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

పండుగల సీజన్‌ కావడం వల్ల ఈ రెండు నెలల్లో వస్తు, సేవల డిమాండ్‌ పెరిగి వసూళ్లు ఊపందుకోనున్నాయని భావిస్తోన్న ఆర్థిక శాఖ.. ఇదే సమయంలో పన్ను ఎగవేతలకు ఉన్నటువంటి అవకాశాలను అరికట్టడం ద్వారా రూ.లక్ష కోట్ల వసూళ్లను సునాయాసంగా అందుకోవచ్చని ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది.

సెప్టెంబర్‌ వసూళ్లు రూ.94,442 కోట్లు ఉండటం కూడా ప్రభుత్వ అంచనాలకు బలాన్ని స్తోంది. ‘రానున్నది పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడం.. వర్తకులు భారీ డిస్కౌంట్లను ప్రకటిం చనుండడం ఆధారంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటేందుకు అవకాశం ఉంది.’ అని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ రజత్‌ మోహన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు