ఎఫ్‌ఎల్‌వో కొత్త కార్యవర్గం బాధ్యతలు

25 Apr, 2018 00:41 IST|Sakshi

హైదరాబాద్, సాక్షి: ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో), యంగ్‌ ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ ( వైఎఫ్‌ఎల్‌వో) సంస్థల కొత్త కార్యవర్గం మంగళవారమిక్కడ ప్రమాణ స్వీకారం చేసింది. ఎఫ్‌ఎల్‌వో ప్రెసిడెంట్‌గా ప్రియాంకా గనేరివాల్‌ , వైఎఫ్‌ఎల్‌వో ప్రెసిడెంట్‌గా వినితా సురానా సహా కొత్త కార్యవర్గ సభ్యులంతా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ వీ–హబ్‌’ ఇన్నోవేషన్‌ సెంటర్‌కు అద్బుతమైన ఆదరణ వస్తోందని, స్టార్టప్స్‌ నుంచి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెప్పారు.

వీ హబ్‌లో చోటు దక్కిన ఔత్సాహిక మహిళలకు ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, బూట్‌క్యాంప్‌లు ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని కోరారు. ఈ  సందర్బంగా  వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన మహిళలు స్వాతిలక్రా, రాషి అగర్వాల్‌ , వైశాలి నియోతియా, మీరా షెనాయ్, రూబీనా మజార్, డాక్టర్‌ కవితా దరియానిరావు,  హిలా హెప్తుల్లా, జాహ్నవి, డాక్టర్‌ ఎవిటా ఫెర్నాండెజ్‌ తదితరులకు ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌వో జాతీయ ప్రెసిడెంట్‌ పింకీరెడ్డి, కామిని షరాఫ్, సంధ్యారాజు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు