రుణ మార్కెట్లపైనే ఎఫ్‌ఐఐల ఆసక్తి

24 Feb, 2014 01:39 IST|Sakshi
రుణ మార్కెట్లపైనే ఎఫ్‌ఐఐల ఆసక్తి

 విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ ఈక్విటీలలో గడిచిన వారం నికరంగా రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ చూస్తే మాత్రం నికరంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు నమోదైంది.

 

కాగా, రుణ(డెట్) మార్కెట్లపట్ల మాత్రం ఎఫ్‌ఐఐలు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నట్లు సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా దాదాపు రూ. 11,000 కోట్ల విలువైన డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. అంటే స్థూలంగా ఫిబ్రవరిలో రూ. 21,210 కోట్ల విలువైన బాండ్లు తదితర సెక్యూరిటీలను కొనుగోలు చేయగా, ఇదే సమయంలో రూ. 10,219 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను విక్రయించారు.

 

ప్రస్తుతం దేశంలో 1,726 మంది ఎఫ్‌ఐఐలు రిజిస్టరై ఉన్నారు. మొత్తం 6,367 సబ్‌అకౌంట్లు నిర్వహిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు